లులు హైపర్ మార్కెట్ ప్రత్యేకమైన ఫుడ్ ఫెస్టివల్
- February 24, 2021
మనామా:నేటి నుంచి మార్చి 6వ తేదీ వరకు లులు హైపర్ మార్కెట్, యూనిక్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనుంది. ఈ ఫెస్టివల్‌కి అందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యద్భుతమైన ఆహార పదార్థాల్ని ఇక్కడ పొందుపరుస్తున్నారు. హైపర్ మార్కెట్ బిగ్ బ్యాంగ్ ఆఫర్స్ కూడా ఈ ఫెస్టివల్ సందర్భంగా అందుబాటులో వుంటాయి. 11 రోజులు సాగే ఈ ఫెస్టివల్‌లో రఫాలె డ్రా మరో ప్రత్యేకత కానుంది. 5 బహ్రెయినీ దినార్స్ ఖర్చు చేస్తే, వినియోగదారులు ఒక కూపన్ పొందుతారు. వారిలో 160 లక్కీ కూపన్స్ అద్భుతమైన బహుమతులు గెలుచుకోవడానికి దోహదం చేస్తాయి. మొత్తం బహుమతుల విలువ 11,000 బహ్రెయినీ దినార్స్. నో షుగర్ ఫ్రూట్ జ్యూస్‌లు, మల్టీ గ్రెయిన్ బ్రెడ్, ఆర్గానిక్ ఫుడ్, లో షుగర్ హై ప్రొటీన్ ట్రీట్స్ వంటివి ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో ప్రధాన ఆకర్షణలు. బిర్యానీ, బీబీక్యూ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రత్యేతలున్నాయి ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







