అక్రమంగా జీతాలు పొందుతున్న కువైటీ పౌరుల అరెస్ట్

- February 25, 2021 , by Maagulf
అక్రమంగా జీతాలు పొందుతున్న కువైటీ పౌరుల అరెస్ట్

కువైట్ సిటీ:తాము చేయని ఉద్యోగాలకు సంబంధించి జీతాలు పొందుతున్న కువైటీ పౌరులు (మహిళలు, పురుషులు) అరెస్టయ్యారు. ప్రైవేటు సెక్టార్‌లో పనిచేస్తున్న మేన్‌పవర్‌కి సంబంధించి ఆర్థిక సాయంగా ఈ జీతాల్ని నిర్దేశించడం జరిగింది. నిందితులు, ఓ కాంట్రాక్టు కంపెనీ ద్వారా ఉద్యోగాలు పొందినట్లు అక్రమంగా పత్రాలు పొందారు. 5,000 కువైటీ దినార్స్ నుంచి 50,000 కువైటీ దినార్స్ వరకు వేతనాల్ని పొందుతున్నట్లుగా పత్రాలు సృష్టించారు. మొత్తం వేతనాలు 250,000 కువైటీ దినార్స్‌గా నిందితులు పొందినట్లు విచారణలో తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com