ఖతార్లో నిషేధిత లిరికా పిల్స్ సీజ్
- February 25, 2021ఖతార్ విమానాశ్రయంలో భారీగా నిషేధిత లిరికా పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఓ ప్యాసింజర్ లగేజీపై అనుమానం రావటంతో ఎయిర్ కార్గో, ప్రైవేట్ ఎయిర్ పోర్ట్స్ కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా సోదా చేశారు. చీరలో దాచిన 6,868 లిరికా మాత్రలను గుర్తించారు. చీర మడతల మధ్యలో మాత్రల ప్యాకెట్ ను పెట్టిన అక్రమ రవాణాదారులు ఎక్స్ రే స్కానర్లకు దొరక్కుండా పకడ్బందీగా ప్లాస్టిక్ కవర్లతో చుట్టినట్లు అధికారులు వెల్లడించారు. పట్టుబడిన మాత్రలను సీజ్ చేసినట్లు వివరించారు. నిషేధిత వస్తువులు, మాదక ద్రవ్యాలు, మాత్రలను దేశంలోకి తీసుకొచ్చే ప్రయత్నం ఎవరు చేయవద్దని, కస్టమ్స్ కళ్లు గప్పి తప్పించుకోగలమని భ్రమ పడొద్దని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ