NPCIL లో ఉద్యోగావకాశాలు

- February 26, 2021 , by Maagulf
NPCIL లో ఉద్యోగావకాశాలు

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ Nuclear Power Corporation of India Limited ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. 200 పోస్టులను భర్తీ చేయనుంది.పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని చూసి ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు వివరాల లోకి వెళితే… మొత్తం 200 ఖాళీలు ఉన్నాయి.

ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులకి ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు.మెకానికల్ 85, ఎలక్ట్రికల్ 40, సివిల్ 35, కెమికల్ 20, ఎలక్ట్రానిక్స్ 8, ఇన్స్ట్రుమెంటేషన్ 7 మరియు ఇండస్ట్రియల్ అండ్ ఫైర్ సేఫ్టీ 5. సంబంధిత సబ్జెక్టులలో బీఈ , బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు దీనికి అర్హులు.

అలానే 2018, 2019, 2020 గేట్ కు హాజరైన అభ్యర్థులు మాత్రమే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చెయ్యాలి. వయసు విషయానికి వస్తే… 2/4 /2020నాటికి 26 సంవత్సరాలు దాటకూడదు. 2018, 2019, 2020 గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చెయ్యొచ్చు.ఆఖరి తేదీ 9/3 /2021. పూర్తి వివరాల కోసం http://npcilcareers.co.inలో చూడండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com