‘హౌస్ అరెస్ట్’ టీజర్ విడుదల
- February 27, 2021
హైదరాబాద్:ప్రముఖ హాస్య నటులు శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్ కీలక పాత్రలతో రూపొందుతున్న వినోదాత్మక చిత్రం ‘హౌస్ అరెస్ట్’. '90ఎంఎల్' సినిమా దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్ర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన హౌస్ అరెస్ట్ ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిచ్చర పిడుగుల్లాంటి కిడ్స్.. వాళ్ళ చేత చిక్కిన దుండగుల బ్యాచ్ మధ్య జరిగిన అల్లరిని చూపిస్తున్న ఈ టీజర్ అన్ని వర్గాలను అలరిస్తోంది. ఈ చిత్రానికి సంగీత సంచలనం అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







