జమాల్ ఖస్తోగి హత్య: అమెరికా రిపోర్టుని ఖండించిన సౌదీ అరేబియా
- February 27, 2021
రియాద్: సౌదీ పౌరుడు జమాల్ ఖస్తోగీ మరణంపై అమెరికా అందించిన రిపోర్టుని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. సౌదీ నాయకత్వానికి దురుద్దేశాలు ఆపాదించేలా ఈ రిపోర్టు వుందని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. ఈ మేరకు మినిస్ట్రీ స్పష్టమైన ప్రకటన చేసింది. ఆ హత్య అత్యంత హేయమైనదనీ, కొందరు వ్యక్తులు చేసిన నీఛరమైన పని అనీ, సౌదీ చట్టాలు ఇలాంటి చర్యల్ని ఉపేక్షించవనీ, ఇంతటి హేయమైన చర్యను సౌదీ అరేబియా సమర్థించుకునే పని చేయదనీ మినిస్ట్రీ తేల్చి చెప్పింది. సౌదీ నాయకత్వంపై దుష్ప్రచారం చేసే ఎలాంటి చర్యల్నీ సౌదీ అరేబియా క్షమించబోదని మినిస్ట్రీ స్పష్టం చేసింది. కాగా, అమెరికా రిపోర్టులో ఖస్తోగీ మరణానికి సౌదీ అరేబియా నాయకత్వమే కారణమని పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







