దుబాయ్:ఛారిటీల పేరుతో మోసాలకు పాల్పడితే 5,00,000 దిర్హామ్ ల ఫైన్
- February 28, 2021
దుబాయ్:కోవిడ్ సంక్షోభ పరిస్థితులను ఆసరాగా చేసుకొని ఛారీటీలు, స్వచ్ఛంద సంస్థల పేరుతో అక్రమంగా విరాళాలు సేకరిస్తే సహించబోమని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. ఈజీ మనీ కోసం కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా స్వచ్ఛంద సంస్థల పేరుతో విరాళాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించింది. డబ్బు సంపాదన కోసం చారిటీల పేరుతో ఫండ్ రైజింగ్ చేసేందుకు ప్రయత్నిస్తే 2,50,000 నుంచి 5,00,000 దిర్హామ్ ల వరకు జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి మోసగాళ్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పోలీసులు..కేవలం ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఆర్గనైజేషన్లకు మాత్రమే విరాళాలు ఇవ్వాలని సూచించారు. మోసగాళ్ల అభ్యర్ధనకు కరిగిపోకుండా..వాళ్లు చెబుతున్న సంస్థకు గుర్తింపు ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాతే సాయం చేయాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







