కువైట్:మోసాఫెర్ యాప్ లో కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్
- February 28, 2021
కువైట్ సిటీ:తమ దేశానికి వచ్చే ప్రయాణికులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మోసాఫెర్ యాప్ లో కొన్ని ఆప్షన్లను జత పరిచింది కువైట్. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులు తమ వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను యాప్ లో అప్ లోడ్ చేసుకోవచ్చు. అందుకు అనుగుణంగా యాడ్ ఏ సర్టిఫికెట్ అనే ఆప్షన్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆప్షన్ పై క్లిక్ చేసి సివిల్ ఐడీ నెంబర్ ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను అప్ లోడ్ చేయవచ్చు. తమ దేశానికి వచ్చే ప్రయాణికులు మోసాఫెర్ యాప్ తప్పనిసరిగా ఇన్ స్టాల్ చేసుకోవాలని గతంలోనే కువైట్ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో యాప్ లో అప్ లోడ్ చేసిన సర్టిఫికెట్ ను అధికారులకు చూపించటం ద్వారా కోవిడ్ నింబంధనల నుంచి కొన్ని మినహాయింపు పొందవచ్చు.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్







