ఇస్రోను శాస్త్రవేత్తలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందన
- February 28, 2021
విజయవాడ:పిఎస్ఎల్వి-సి 51 ప్రయోగం విజయవంతం కావటం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హర్హం వ్యక్తం చేసారు.ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన గవర్నర్ అంతరిక్ష ఆవిష్కరణలలో నూతన అధ్యాయం ప్రారంభమైందన్నారు. 19 ఉపగ్రహాల ప్రయోగం భారతీయ అంతరిక్ష పరిశోధనల పటుత్వాన్ని ప్రపంచానికి చాటి చెబుతుందన్నారు. ఇస్రో, బ్రెజిల్ అనుసంధానంతో చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతం కావటం భారతీయులుగా మనందరికీ గర్వ కారణమని గవర్నర్ ప్రస్తుతించారు. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం ఉదయం 10.24 గంటలకు పీఎస్ఎల్వీ సీ51 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా, 19 ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లింది. వీటిలో దేశీయ ప్రైవేట్ సంస్థలకు చెందిన 5 ఉపగ్రహాలు, 14 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలోకి మొదటిసారి ప్రధాని మోదీ ఫొటో, భగవద్గీత కాపీ, 25 వేల మంది పేర్లను పంపింది. వాటిలో వెయ్యి మంది విదేశీయుల పేర్లతో పాటు చెన్నై విద్యార్ధుల పేర్లు చేసుకోవటం విశేషమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన వెలువడింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







