తల్లితండ్రులను గౌరవించి నప్పుడే మన సంస్కృతిని గౌరవించినట్లు:అలనాటి నటీమణి జమున
- February 28, 2021
'మన తన తల్లిదండ్రులను గౌరవించడం కూడా మన సంస్కృతి' అన్న విషయం గుర్తుంచుకో గుర్తుంచుకోవాలనీ, మనం ఎంత గొప్ప వాళ్ళమైనా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రేమించి వారిని వృద్ధాశ్రమాల పాలు చేయకూడదని స్వర్ణయుగ ప్రజా నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు, కళాభారతి జమునా రమణ రావు అంతర్జాలంలో వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా, అమెరికా వారు నిర్వహించిన సేవా శిరోమణి సుభద్ర మూర్తి 83 వ జయంతి సభలో పాల్గొని మాట్లాడుతూ తమ సందేశాన్ని ఇచ్చారు.
అమెరికాలో ఉంటున్న సుభద్ర మూర్తి కుమార్తె ఆమె తల్లిదండ్రుల పేరుమీద ఒక పురస్కారాన్ని స్థాపించి ప్రతి సంవత్సరం బహూకరించడం ఎంతో ప్రశంసనీయమనీ అన్నారు.వంశీ అధ్యక్షులు వంశీ రామరాజు అంతర్జాల సభకు అధ్యక్షత వహిస్తూ సుభద్రామూర్తి రెడ్ క్రాస్ సంస్థ వారధిగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా సాంస్కృతిక సంస్థలకు, వృద్ధులకు, దివ్యాంగుల ఆశ్రమాలకు చేయూత నిచ్చిన సేవా శిరోమణి అని ప్రశంసించారు.
అమెరికాలో ఫ్లోరిడాలో ఉంటున్న సురేఖ కిషోర్ జ్యోతి ప్రకాశనంతో ప్రారంభమైన ఈ అంతర్జాల కార్యక్రమంలో లక్ష్మీ శ్రీనివాస్ రామరాజు తన వీణ నాదంతో కార్యక్రమానికి శోభను చేకూర్చారు... రామాంతపూర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని అనఘాదత్త రామరాజు ప్రార్థనా గీతం ఆలపించారు.. అవార్డు స్వీకరించిన రోజా మీన్ ప్రాధాన్ తను చేస్తున్న సేవలకు గుర్తింపుగా సుభద్ర పేరు మీద నెలకొల్పిన అవార్డును స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.. కార్యక్రమ సంధానకర్త, అమెరికా వాస్తవ్యులు భరద్వాజ శ్రీనివాస కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన సంగీత కార్యక్రమంలో భాను శాస్త్రి (అమెరికా), అనూప్ శాస్త్రి (అమెరికా), ప్రమీలా ఆరబ్, పద్మా ప్రమోద్ ,నిర్మల కొచ్చర్లకోట ,యామిని రమణ, కార్తీక్, మహతీ భరద్వాజ్ తమ గానాన్ని వినిపించారు.. రాగ సప్తస్వర రాజ్యలక్ష్మి సంధ్యారాణి ,సుభద్ర మూర్తి తో తమకున్న అనుబంధాన్ని తెలియజేశారు.. వంశీ సంస్థ అధ్యక్షురాలుతెన్నేటి సుధా దేవి, మేనేజింగ్ ట్రస్టీ శైలజ సుంకర పల్లి కార్యక్రమ నిర్వహణలో పాలుపంచుకున్నారు..
ట్రై నెట్ లైవ్ టీవీ, టీ వీఏసియా తెలుగు, యు ఎస్ వన్ టీవీ, మన టీవీ వారు కార్యక్రమం మొత్తాన్ని అంతర్జాతీయంగా ప్రసారం చేశారు
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!