టీడీపీ కువైట్ మహానాడులో కోడెల శివప్రసాద్
- May 30, 2015
‘తెలుగుదేశం పార్టీ - కువైట్’ ఆధ్వర్యంలో మహానాడు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కువైట్లోని తెలుగుదేశం పార్టీ అభిమానులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్, టీడీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాద్ ‘టీడీపీ కువైట్ మహానాడు’ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శుక్రవారం మే 29వ తేదీ సాయంత్రం 4 గంటలనుండి కువైట్ బాయ్స్ స్కవుట్ అసోసియేషన్, హవల్లీ సెంటర్ పాయింట్ ఎదురుగా మహానాడు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నేపథ్య గాయకులు, వారి బృందం సంగీత విభావరి నిర్వహించింది. ఆహూతుల్ని ఈ సంగీత విభావరి అలరించింది. కార్యక్రమం అనంతరం రుచికరమైన విందును ఆస్వాదించారు ‘మహానాడు’లో పాల్గొన్నవారు. మా గల్ఫ్ డాట్ కామ్ మీడియా పార్ట్నర్ గా వ్యవహరించింది.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









