రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో ఉద్రిక్తత..

- March 01, 2021 , by Maagulf
రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో ఉద్రిక్తత..

రేణిగుంట:చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన ఉద్రిక్తంగా మారింది.బాబు చిత్తూరులో పర్యటించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు.ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న బాబును పోలీసులు ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారు.ఎయిర్ పోర్టులోనే బాబుకు నోటీసులు ఇచ్చారు.కరోనా నిబంధనలు, మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో ఎలాంటి ధర్నాలు, దీక్షలకు అనుమతులు లేవని పోలీసులు పేర్కొన్నారు.దీంతో తెలుగుదేశం పార్టీ తిరుపతిలో నిరసనలు తెలియజేసింది. చిత్తూరులో దీక్ష, తిరుపతిలో ధర్నా చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com