ఎమిరేట్స్ ప్రయాణీకులు ఖాళీగా వున్న పక్క సీటుని కొనుగోలు చేసే అవకాశం

ఎమిరేట్స్ ప్రయాణీకులు ఖాళీగా వున్న పక్క సీటుని కొనుగోలు చేసే అవకాశం

దుబాయ్:ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించే ఎమిరేట్స్ ప్రయాణీకులు, తమ పక్కనున్న ఖాళీ సీట్‌ని కూడా కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు.తద్వారా మరింత సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలు కలగనుంది.ఎకానమీ క్లాస్ వినియోగదారులందరికీ ఈ అవకాశం వుంటుందని ఎమిరేట్స్ వెల్లడించింది.ఎయిర్ పోర్టు చెక్ ఇన్ కౌంటర్ వద్ద విమానం బయల్దేరడానికి కొద్ది సమయం ముందు మాత్రమే వీటిని కొనుగోలు చేయడానికి వీలవుతుంది. 200 దిర్హాముల నుంచి 600 దిర్హాముల వరకు ఈ సీట్ల ధరలు వుంటాయి. పన్నులు అదనం.ఒక వరుసలో అత్యధికంగా మూడు సీట్లను పొందే అవకాశం వుంటుంది.చిన్న పిల్లలతో వెళ్ళే తల్లిదండ్రులు అలాగే భార్యా భర్తలకు, కరోనా నేపథ్యంలో అదనపు సౌకర్యం, భద్రత కోసం చూసేవారు ఈ వెసులుబాటుని వినియోగించుకోవచ్చు.

 

Back to Top