సైడ్ పార్కింగ్ మీటర్ల పునఃప్రారంభం

సైడ్ పార్కింగ్ మీటర్ల పునఃప్రారంభం

కువైట్ సిటీ:కువైట్ మునిసిపాలిటీ, సైడ్ వెహికిల్స్ పార్కింగ్‌కి సంబంధించి మీటర్ల విధానాన్ని తిరిగి ప్రారంభించాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌కి విజ్ఞప్తి చేసింది.సైడ్ కార్ పార్క్‌కి సంబంధించి వర్టికల్ మీటర్లు చాలావరకు డ్యామేజ్ అయినట్లు అధికారులు చెబుతున్నారు.ఈ కారణంగా వాహనాల యజమానులు పరిమిత సమయం కంటే ఎక్కువ సమయం షాప్స్ వద్ద వాహనాల్ని నిలుపుదల చేస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా.పాడైపోయిన మీటర్లను బాగు చేయించడం, అవసరమైన చోట్ల కొత్తవి ఏర్పాటు చేయడం వంటివాటిపై మినిస్ట్రీకి విజ్ఞప్తి చేసింది మునిసిపాలిటీ. కువైట్ సిటీలోని అల్ సల్హియా మరియు ఫహాద్ అల్ సలెం స్ట్రీట్ సహా మరికొన్ని చోట్ల ఈ చర్యలు చేపట్టాల్సి వుంది.

Back to Top