హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బెస్ట్ ఎయిర్‌పోర్ట్ అవార్డ్

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బెస్ట్ ఎయిర్‌పోర్ట్ అవార్డ్

హైదరాబాద్:జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ (GHIAL) ప్రతిష్టాత్మక ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ASQ) అవార్డును సాధించింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో, 15-25 మిలియన్ ప్యాసింజర్స్ (ఎంపిపిఎ) విభాగంలో ‘సైజు మరియు ప్రాంతం వారీ ఉత్తమ విమానాశ్రయం’ గా ఎంపికైంది. ASQ అనేది ప్రపంచంలోని ప్రముఖ విమానాశ్రయ ప్రయాణీకుల సేవలు, విమానాశ్రయం ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణీకుల సంతృప్తిని కొలిచే కార్యక్రమం. ఈ పోటీలో పాల్గొనే అన్ని విమానాశ్రయాల ద్వారా 150 కంటే ఎక్కువ ప్రత్యేకమైన చెక్ పాయింట్ల ద్వారా ASQ డేటా సేకరణ చేస్తారు. 

ఈ గుర్తింపుపై GHIAL యొక్క CEO ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ, “ACI నిర్వహించిన వార్షిక ASQ సర్వే 2020లో ప్రయాణీకులు మమ్మల్ని ఉత్తమ విమానాశ్రయంగా ఎన్నుకోవడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాము. ఈ ఘనత DGCA, CISF, BCAS, AAI, ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్, ఎయిర్‌లైన్స్‌తో సహా మా భాగస్వాముల నిరంతర కృషికి నిదర్శనం; మా ఉద్యోగులు, ఇతర వ్యాపార భాగస్వాములు/విక్రేతలు కోవిడ్ మహమ్మారి కాలంలో విరామం లేకుండా పని చేశారు. ఈ క్లిష్ట సమయాల్లో మాకు నిరంతర మద్దతు ఇచ్చిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు మా కృతజ్ఞతలు. ఈ పురస్కారం ప్రయాణీకులకు ఆనందకరమైన అనుభవాన్ని అందించడానికి, మా నిరంతర కృషిని కొనసాగించడానికి స్ఫూర్తినిస్తుంది. ” అన్నారు.

ఎస్.జి.కె కిషోర్, ఈడీ-సౌత్ మరియు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్- జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్, మాట్లాడుతూ “కోవిడ్ -19 మాకు చాలా పాఠాలు నేర్పింది. ప్రయాణాన్ని మరింత సురక్షితం చేయడానికి, కస్టమర్లకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించడానికి మేము మెరుగైన అంతర్గత సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాము. ACI ASQ అవార్డు మా కృషికి నిదర్శనం. ఈ పురస్కారం కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ధైర్యాన్ని ప్రదర్శించిన భాగస్వాములందరి యొక్క సమిష్టి కృషి. GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సురక్షితమైన మరియు ఎలాంటి ఆటంకాలూ లేని ప్రయాణ అనుభవానికి కట్టుబడి ఉంటుందని మరోసారి ధృవీకరించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాము”. అన్నారు.

జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభినందించిన ఎసిఐ వరల్డ్ డైరెక్టర్ జనరల్ శ్రీ లూయిస్ ఫెలిప్ డి ఒలివెరా, “రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సైజ్ అండ్ రీజియన్ (ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 15 నుంచి 25 మిలియన్ ప్యాసింజర్స్ పర్ ఇయర్) ఎయిర్ పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ASQ) 2020 ఉత్తమ విమానాశ్రయ అవార్డును గెలుచుకుందని తెలియజేయడం నాకు సంతోషంగా ఉంది. ఇలాంటి క్లిష్టమైన ఏడాదిలో, కస్టమర్లకు మంచి అనుభవాన్ని అందించడంలో మీ బృందం చేసిన విజయవంతమైన ప్రయత్నాలకు ఇది గుర్తింపు. మీ టీమ్ అంతటికీ నా అభినందనలు.” అన్నారు.

పిపిపి మోడల్ క్రింద అభివృద్ధి చేయబడిన భారతదేశపు మొట్టమొదటి ఆధునిక, గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం హైదరాబాద్ విమానాశ్రయం - సేవ మరియు కార్యాచరణ సమర్థత పరంగా ఎంతో ప్రసిద్ధి గాంచింది. హైదరాబాద్ విమానాశ్రయం క్రమం తప్పకుండా ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) - ఎయిర్‌పోర్ట్స్ సర్వీస్ క్వాలిటీ (ASQ) ప్యాసింజర్ సర్వేలో వరుసగా 9 సంవత్సరాలు (2009 నుండి 2017 వరకు) గ్లోబల్ టాప్-3 విమానాశ్రయాలలో ఒకటిగా నిలిచింది. 5 - 15 MPPA విభాగంలో 2009, 2010, 2016 & 2017 లో ప్రపంచ నంబర్ 1 స్థానం; 15-25 MPPA విభాగంలో 2018లో ప్రపంచ నంబర్ 4వ స్థానంలో నిలిచింది. 2019లో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో, 15-25 ఎంపిపిఎ విభాగంలో ‘బెస్ట్ ఎయిర్ పోర్ట్ బై సైజ్ అండ్ రీజియన్' మరియు, 'బెస్ట్ ఎయిర్ పోర్ట్ ఇన్ ఎన్విరాన్మెంట్ అండ్ యాంబియన్స్ బై సైజ్’గా ఎంపిక కావడం ద్వారా ఎసిఐ ASQ డిపార్చర్స్ అవార్డులను గెలుచుకుంది.

2020 లో COVID-19 మహమ్మారి సమయంలో ప్రయాణీకుల అభిప్రాయాలను సేకరించి, వారి అవసరాలను అర్థం చేసుకుని దానికి అనుగుణమైన చర్యలు తీసుకున్న నిరంతర ప్రయత్నాల ఫలితంగా ఇటీవల, GHIAL ACI వరల్డ్ యొక్క “వాయిస్ ఆఫ్ కస్టమర్” గుర్తింపు పొందింది. 

విమానాశ్రయ ఆపరేటర్లకు ప్రయాణీకుల భద్రత ప్రధానమైన ప్రస్తుత COVID-19 మహమ్మారి కాలంలో హైదరాబాద్ విమానాశ్రయం ACI యొక్క ఎయిర్‌పోర్ట్ హెల్త్ అక్రిడిటేషన్ (AHA) ను సాధించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ గౌరవనీయమైన గుర్తింపు పొందిన మొదటి విమానాశ్రయాలలో హైదరాబాద్ ఒకటి.

 

Back to Top