మహాశివరాత్రి వేడుకలకు బ్రేక్..

మహాశివరాత్రి వేడుకలకు బ్రేక్..

దుబాయ్:కరోనా మహమ్మారి రోజు రోజుకి పెరగడంతో బర్ దుబాయ్‌లోని దేవాలయంలో ఈ ఏడాది మహాశివరాత్రి పూజల్ని రద్దు చేస్తున్నట్లు దేవాలయ ట్రస్టీ రాజు ష్రాఫ్ మాగల్ఫ్ కు తెలిపారు.ఈ నెల 11న(గురువారం) మహా శివరాత్రితో పాటు వారంతపు సెలవులు కూడా రావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.శివాలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు.ఇది మొత్తం యూఏఈ‌లో ఉన్న ఏకైక హిందూ దేవాలయం కావడం గమనార్హం.శివరాత్రి నాడు పూజలు, అభిషేకాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రయత్నిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు.కరోనా కారణంగా దుబాయ్‌లో గత ఏడాది మసీదులు, చర్చిలతో పాటు శివాలయాన్ని కూడా మూసివేశారు. 

Back to Top