క్వారంటైన్ నిబంధన నుంచి 5 వర్గాలకు మినహాయింపు

- March 02, 2021 , by Maagulf
క్వారంటైన్ నిబంధన నుంచి 5 వర్గాలకు మినహాయింపు

కువైట్ సిటీ:కువైట్ చేరుకునే అంతర్జాతీయ ప్రయాణికులు అందరూ ఖచ్చితంగా క్వారంటైన్ లో ఉండాలని కండీషన్ విధించిన కువైట్..కొన్ని వర్గాలకు మాత్రం క్వారంటైన్ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. మొత్తం ఐదు కేటగిరిలకు చెందిన వ్యక్తులు విదేశాల నుంచి వచ్చినా క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.కువైట్ డీజీసీఏ తెలిపిన వివరాల మేరకు విదేశాల నుంచి వచ్చే దౌత్య వేతలు, దౌత్య కార్యాలయ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అలాగే విదేశాలల్లో చికిత్స పొంది సొంత దేశానికి తిరిగి వచ్చే కువైట్ పౌరులు, చదువ కోసం విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చే కువైట్ విద్యార్ధులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహించే వైద్య సిబ్బంది వారి రక్త సంబంధీకులు క్వారంటైన్ నిబంధనను పాటించాల్సిన అవసరం లేదు. అయితే..వైద్య సిబ్బంది తమ రక్త సంబంధికుల వివరాలను రుజువు చేసేలా తగిన డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.ఐదో కేటగిరిలో భాగంగా 18 ఏళ్లలోపు వారిని క్వారంటైన్ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది కువైట్. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com