మహాశివరాత్రి వేళ గురుదర్బార్ సింధి ఆలయం మూసివేత
- March 03, 2021
దుబాయ్:కోవిడ్ మహామ్మారి ముప్పు పొంచి ఉండటంతో ఈ ఏడాది మహాశివరాత్రికి గురుదర్బార్ ఆలయ ద్వారాలు మూసుకోనున్నాయి.భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండటంతో ఈ నెల 11,12 తేదీల్లో ఆలయంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. అయితే..భక్తులు నిరాశ పడాల్సిన అవసరం లేదని..శివరాత్రి సందర్భంలో ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజలను వర్చువల్ గా వీక్షించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. https://youtu.be/64G4XbKXEBA లింక్ ద్వారా భక్తులు శివరాత్రి పూజలను చూసి..ఇంటి దగ్గర్నుంచే పరమశివుడ్ని ప్రార్ధించుకోవాలని ఆలయ ధర్మకర్త కోరారు.

దుబాయ్ లోని ఈ ఆలయం ప్రతి ఏడాది మహాశివరాత్రి వేళ భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఏడాదిలో నూతన సంవత్సరం, దీపావళి వంటి ముఖ్యమైన రోజుల తర్వాత మహాశివరాత్రి రోజున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజలు నిర్వహిస్తుంటారు.అయితే..కోవిడ్ తీవ్రత మళ్లీ పెరుగుతున్న ప్రస్తుత సమయంలో భక్తుల క్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ధర్మకర్త వివరించారు. సమాజ ఆరోగ్య భద్రతలో భాగంగా ప్రభుత్వ సూచనలకు కట్టుబడి ఉండాల్సిన మన అందరిపై ఉందన్నారు. మహాశివరాత్రి చీకటిని, అజ్ఞానాన్ని అధిగమించడాన్ని సూచిస్తుందని..ఈ పండుగ మహమ్మారి చీకటిని అధిగమించడానికి నాంది అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







