మహాశివరాత్రి వేళ గురుదర్బార్ సింధి ఆలయం మూసివేత

- March 03, 2021 , by Maagulf
మహాశివరాత్రి వేళ గురుదర్బార్ సింధి ఆలయం మూసివేత

దుబాయ్:కోవిడ్ మహామ్మారి ముప్పు పొంచి ఉండటంతో ఈ ఏడాది మహాశివరాత్రికి గురుదర్బార్ ఆలయ ద్వారాలు మూసుకోనున్నాయి.భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండటంతో ఈ నెల 11,12 తేదీల్లో ఆలయంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. అయితే..భక్తులు నిరాశ పడాల్సిన అవసరం లేదని..శివరాత్రి సందర్భంలో ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజలను వర్చువల్ గా వీక్షించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. https://youtu.be/64G4XbKXEBA లింక్ ద్వారా భక్తులు శివరాత్రి పూజలను చూసి..ఇంటి దగ్గర్నుంచే పరమశివుడ్ని ప్రార్ధించుకోవాలని ఆలయ ధర్మకర్త కోరారు.

దుబాయ్ లోని ఈ ఆలయం ప్రతి ఏడాది మహాశివరాత్రి వేళ భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఏడాదిలో నూతన సంవత్సరం, దీపావళి వంటి ముఖ్యమైన రోజుల తర్వాత మహాశివరాత్రి రోజున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజలు నిర్వహిస్తుంటారు.అయితే..కోవిడ్ తీవ్రత మళ్లీ పెరుగుతున్న ప్రస్తుత సమయంలో భక్తుల క్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ధర్మకర్త వివరించారు. సమాజ ఆరోగ్య భద్రతలో భాగంగా ప్రభుత్వ సూచనలకు కట్టుబడి ఉండాల్సిన మన అందరిపై ఉందన్నారు. మహాశివరాత్రి చీకటిని, అజ్ఞానాన్ని అధిగమించడాన్ని సూచిస్తుందని..ఈ పండుగ మహమ్మారి చీకటిని అధిగమించడానికి నాంది అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com