కూతుర్ని కారులోనే మర్చిపోయిన తండ్రి..మృతి చెందిన చిన్నారి
- March 03, 2021
దుబాయ్:ఓ కన్నతండ్రి నిర్లక్ష్యంత తన కూతుర్ని బలితీసుకుంది.దుబాయ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ల కూతుర్ని వెంటబెట్టుకొని షాపింగ్ వెళ్లిన వ్యక్తి..షాపింగ్ తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడు.షాపింగ్ చేసిన వస్తువులను ఇంట్లోకి తీసుకెళ్లేందుకు సహకరించాలని కూతుర్ని కోరిన అతను..ఆ వెంటనే ఇంట్లోకి వెళ్లిపోయాడు.నీరసంగా ఉండటంతో నేరుగా బెడ్రూంలోకి వెళ్లి పడుకున్నాడు.అయితే..తన వెంట తన నాలుగేళ్ల కూతురు వస్తుందో లేదో అనే విషయాన్ని మాత్రం అతను గమనించలేదు.రెండు గంటలు గడిచిన తర్వాత చిన్నారి కనిపించటం లేదంటూ ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఇంటి ప్రాంగణంలో వెతకటం ప్రారంభించారు. షాపింగ్ తర్వాత ఇంట్లోకి రాలేదని గమనించి..వెంటనే చిన్నారి తండ్రిని అడిగారు. వెంటనే అతను కారు దగ్గరికి వెళ్లి చూసే సరికి కారులోనే ఆ పాప ప్రాణాలు కొల్పోయి ఉంది. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు..తమకు రాత్రి ఏడున్నర గంటల సమయంలో సమాచారం వచ్చిందని తెలిపారు. అయితే, కారులో ఊపిరి ఆడకపోవటం వల్లే పాప మృతి చెందినట్లు మెడికల్ రిపోర్ట్ లో తేలిందని, నేరానికి పాల్పడిన దాఖలాలు ఏమి లేవని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి, వాహనాల్లో వాళ్లను ఒంటరిగా వదిలి వెళ్లవద్దని పోలీసులు సూచించారు. ముఖ్యంగా సమ్మర్లో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా









