కరోనా వ్యాక్సిన్ పై ఉధృతంగా ప్రచారం చేయాలి:టి.గవర్నర్
- March 03, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో ఉన్న భయాన్నితొలగించేందుకు, పూర్తి స్థాయిలో అవగాహనకల్పించేందుకు ఉధృతంగా ప్రచారం చేయాలని తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాన్ అన్నారు.అలాగే రెడ్ క్రాస్‌సొసైటీ తెలంగాణ శాఖ కూడా జిల్లాల వారీగా భారీగా ప్రచారాన్ని చేపట్టాలని అన్నారు.ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ దేశంలో జరుగుతోందని చెప్పారు.వ్యాక్సిన్ తయారీ, అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరాలో దేశం స్వయం సమృద్ధి సాధించిందని గవర్నర్ తెలిపారు.అర్హులైన వారు వ్యాక్సిన్ వేసుకునేందుకు ఇది ఎంతో మంచి అవకాశమని అన్నారు.

తెలంగాణలోని పరిస్థితులపై గవర్నర్ తమిళఙసై బుధవారం పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్‌భవన్ డిస్పెన్సరీ మెడికల్ అధికారులు నీలోఫర్ హాస్పిటల్ అధికారులతో సమన్వయంఓ వ్యవహరించి రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న హోంగార్డ్ కూతురుకు సర్జరీ జరిగేలా చూడాలని ఆదేశించారు. అలాగే రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న అర్హులైన సిబ్బంది కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు పేర్లునమోదుచేసుకోవడం పట్ల గవర్నర్ వారిని అభినందించారు. రాజ్‌భవన్ సిబ్బంది ఇతరులకు రోల్‌మోడల్‌గా ఉండాలని అన్నారు.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







