కరణ్ జోహార్ పై జోకులు వేస్తున్న నెటిజన్లు
- March 04, 2021
బాలీవుడ్ సెలబ్రిటీల్లో హీరో రణ్‌వీర్ సింగ్‌ను ఫ్యాషన్ ఐకాన్‌గా చెప్పుకుంటారు. ఎప్పుడూ ట్రెండ్‌ను ఫాలో అవడమే కాక అప్పుడప్పుడు ట్రెండ్‌ను సెట్ చేస్తుంటాడీ హీరో. అయితే కొత్త లుక్స్‌తో, కొంగొత్త వెరైటీ డ్రెస్సులతో నిర్మాత కరణ్ జోహార్ అతడికి తరచూ కాంపిటీషన్ ఇస్తుంటాడు. తాజాగా ఈ ప్రొడ్యూసర్ ఓ వైవిధ్యమైన బట్టలు ధరించాడు. న్యూస్‌పేపర్ ప్రింట్ వేసి ఉన్న షర్ట్‌ను ధరించాడు. దానికి జోడీగా బ్లాక్ ట్రాక్ ప్యాంట్స్ వేసుకున్నాడు.
అయితే సెలబ్రిటీలు ఏం చేసినా దాన్ని ఇట్టే పట్టేసుకునే నెటిజన్లు కరణ్ డ్రెస్సింగ్ గురించి జోకులు పేలుస్తున్నారు. అతడు నిజంగానే పేపర్ చుట్టుకున్నట్లే ఉందని, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది చినిగిపోవడం ఖాయంగా కనిపిస్తోందంటూ కామెంట్ల వర్షం కురిపించారు. మరికొందరు అది నిజంగానే వార్తాపత్రికే అని భ్రమపడి ఎందుకీయన పేపర్ కప్పుకున్నాడని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా కరణ్ ఈ డ్రెస్సులో మనీష్ మల్హోత్రా నివాసంలో పార్టీకి హాజరయ్యాడు. ఈ పార్టీలో బీటౌన్ సెలబ్రిటీలు కరీష్మా కపూర్, మలైకా అరోరా, అమృత అరోరా, మహీప్ కపూర్, సీమా ఖాన్, గౌరీ ఖాన్ తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం