సేల్స్ కాల్ వల్ల 12 మిలియన్ దిర్హాములు గెల్చుకున్న భారత వలసదారుడు
- March 04, 2021
యూఏఈ: ఓ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ చేసిన ఫోన్ కాల్, భారతీయ వలసదారుడు శివమూర్తి కృష్ణప్పకి 12 మిలియన్ దిర్హాములు గెలచుకునే అవకాశం కల్పించింది. మెకానికల్ ఇంజనీర్ అయిన కృష్ణప్ప, టిక్కెట్లను కొనుగోలు చేసే క్రమంలో ప్రతిసారీ ఎగ్జిక్యూటివ్‌లను మార్చుతుంటారు. అయితే, ‘బై వన్ గెట్ వన్’ ఆఫర్ వుందంటూ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేయడంతో, ఆయన ఆలోచన మారింది. ఆ కాల్ అతనికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఫిబ్రవరిలో ఆయన టిక్కెట్ 202511 అనూహ్యంగా బహుమతిని గెలుచుకుంది. 2005లో తాను షార్జాలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం సంపాదించానని, మూడేళ్ళపాటు తాను అదృష్టం పరీక్షించుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యానని అన్నారు. ప్రతిసారీ 500 దిర్హాములు ఖర్చు చేసి టిక్కెట్ కొనుగోలు చేశానని, అనూహ్యంగా ఈసారి తనకు అదృష్టం కలిసొచ్చిందని వివరించారు. భార్య శ్వేత, కుమార్తె షమిత, కుమారుడు షాన్ పేర్లతో టిక్కెట్లు కొనుగోలు చేసి విజయం సాధించానని అన్నారు. ఇంత సొమ్ము గెలుచుకున్నాక ఏం చేయాలనే ఆలోచనలో పడ్డాననీ, ముందు ముందు భవిష్యత్తు గురించి తీరిగ్గా ఆలోచిస్తానని అన్నారాయన.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం