యూఏఈ:ఇక ఇంటి దగ్గరే ఉచితంగా పీసీఆర్ టెస్టులు
- March 05, 2021
యూఏఈ:ప్రజల ఆరోగ్య భద్రత కోసం, కోవిడ్ ముప్పును సాధ్యమైనంత తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్న యూఏఈ లేటెస్ట్ గా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓ వైపు వ్యాక్సినేషన్ను ముమ్మరం చేస్తూనే మరోవైపు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇంటి దగ్గరే ఉచితంగా పీసీఆర్ టెస్టులను నిర్వహించబోతోంది. ఇందులో కోసం ప్రత్యేక వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసింది. పీసీఆర్ టెస్టుల కోసం వైద్య కేంద్రాలకు తరలిరాటం వల్ల ప్రజల సమయం వృద్ధా అవటంతో పాటు ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు కూడా ఎక్కువే. దీంతో ఇంటి దగ్గరే ఉచితంగా పీసీఆర్ టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే..వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, ఇతర వ్యాధులతో బాధపడే వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని రక్షించుకోవటంతో పాటు తోటి వారి ఆరోగ్య భద్రతకు సహకరించాలని, ఇంటి దగ్గర నిర్వహించే ఉచిత పీసీఆర్ టెస్ట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల