భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 05, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది.ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి.తాజా బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 16,838 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,73,761కి చేరింది.ఇందులో 1,08,39,894 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,76,319 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 113 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,57,548కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 13,819 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.కోలుకున్న వారి సంఖ్య కంటే కొత్త కేసులు అధికంగా ఉండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది.ఇక దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది.ఇప్పటి వరకు 1,80,05,503 మందికి వ్యాక్సిన్ ను అందించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







