నకిలీ బంగారంతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

- March 05, 2021 , by Maagulf
నకిలీ బంగారంతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్:ఇంట్లో బంగారు నిల్వలను వెలికితీస్తామంటూ నకిలీ బంగారంతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టుచేశారు.వారి వద్ద నుంచి 6 కేజీల బరువుగల 11 నకిలీ బంగారం బిస్కెట్లు,8 లక్షల రూపాయల నగదును స్వాధీనంచేసుకున్నారు. నలుగురు ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు అరెస్టుచేశారు.హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన ఆర్‌ఎంపి డాక్టర్ దస్తరిగి మరో నలుగురితో కలిసి నకిలీ బంగారం పేరుతో మోసాలకు పాల్పడుతున్నాడు.ఇంట్లో బంగారం నిల్వలు ఉన్నాయంటూ..ముందుగా వేసుకున్న పథకం ప్రకారం నకిలీ బంగారం బిస్కెట్లు తీసి..వాటిని ఓ ముటలో పెడతారు.వాటిని తాకితే బంగారం ఇనుము అవుతుందని సినీపక్కీలో మోసాలకు పాల్పడుతున్నారు.

నకిలీ బంగారం విక్రయించి మోసం చేస్తుండగా.. బాధితులు పోలీసులు ఆశ్రయించారు. దీంతో పోలీసులు నకిలీ వైద్యుడు దస్తగిరితోపాటు అతనికి సహాకరిస్తున్న అబ్దుల్ రహీమ్,షేక్ హఫీజ్‌, మిర్జా అబ్బాస్‌ లను అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.అయితే ప్రజలు అత్యాశకు పోయి మోసపోవద్దని పోలీసులు తెలిపారు. తక్కువ ధరకు బంగారం వస్తుందని, గుప్తనిధులు ఉన్నాయని మోసాలకు పాల్పడే ముఠాలనుంచి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com