క్యాబ్‌లో నగదు గుర్తింపు: తిరిగిచ్చేసిన డ్రైవర్
- March 05, 2021
యూఏఈ:కరీమ్ డ్రైవర్ ఒకరు తన క్యాబ్‌లో ప్రయాణీకులు మర్చిపోయిన నగదును గుర్తించి వెంటనే, పోలీసులకు సమాచారం ఇచ్చారు.మొత్తం 900,000 దిర్హాముల నగదును ప్రయాణీకులు మర్చిపోవడం జరిగింది. బర్ దుబాయ్ పోలీస్ స్టేషన్‌కి సమాచారం ఇచ్చి, నగదును అప్పగించారు డ్రైవర్ మొహమ్మద్ అర్ఫాన్ మొహమ్మద్ రఫీక్. ఈ నేపథ్యంలో అత్యంత నీతివంతంగా వ్యవహరించిన డ్రైవర్‌ను సన్మానించింది దుబాయ్ పోలీస్. బ్రిగేడియర్ అబ్దుల్లా కరీమ్ సరూర్ (బర్ దుబాయ్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్), డ్రైవర్‌పై ప్రశంసలు కురిపించారు. సర్టిఫికెట్ ఆఫ్ అప్రీషియేషన్‌తో డ్రైవర్‌ను సత్కరించారు. తనను సత్కరించిన పోలీసు వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు డ్రైవర్.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







