కరోనా రూల్స్ బ్రేక్..366 షాప్స్ క్లోజ్
- March 05, 2021సౌదీ:కరోనా నిబంధనలను పాటించటంలో విఫలమైన 366 షాపులను మూసివేసినట్లు సౌదీ గృహనిర్మాణ, మున్సిపల్, రూరల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వైరస్ ను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా నడుచుకోవాలని..ముఖ్యంగా వ్యాపార సంస్థలు, షాపు నిర్వాహకులు ప్రభుత్వం సూచించిన మార్గనిర్దేశకాలను తప్పనిసరిగా పాటించాలని మంత్రిత్వ శాఖ కోరింది. యాంటీ కరోనా వైరస్ ప్రయత్నాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన ఏ ఒక్కరిని ఉపేక్షించబోమని హెచ్చరించింది. నిబంధనలను పకడ్బందీగా అమలు చేసేందుకు కింగ్డమ్ వ్యాప్తంగా 24,066 షాపులు, అహార సంస్థలు, ప్రజా మార్కెట్లలో తనిఖీలు చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. తమ తనిఖీల్లో 1,226 చోట్ల ఉల్లంఘనలను గుర్తించినట్లు తెలిపారు. ఉల్లంఘన తీవ్రతను బట్టి కోవిడ్ రూల్స్ బ్రేకర్స్ పై చర్యలు చేపట్టామని..366 షాపులను మూసివేశామని వివరించారు.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత