శ్రీకారం ట్రైలర్ విడుదల
- March 05, 2021
హైదరాబాద్:యంగ్ హీరో శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా 'శ్రీకారం'. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమాకు కిశోర్ దర్శకత్వం వహించాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మించారు. తాజాగా యువ హీరోలు నితిన్, నాని, వరుణ్ తేజ్ శ్రీకారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్ లో రైతు పాత్రలో శర్వానంద్ ఆకట్టుకోగా… పాటల్లో హీరోయిన్ ప్రియాంక గ్లామర్ కనువిందు చేస్తోంది. ఈ ట్రైలర్ లో శర్వానంద్ వ్యవసాయం గురించి చెప్పే డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘ఉమ్మడిగా చేసిన యుద్ధాల్లో రాజ్యాలే గెలిచాం.. సేద్యం కూడా గెలవచ్చు’ లాంటి సంభాషణలు బాగున్నాయి. మిక్కీ జె.మేయర్ సంగీతం అలరించింది. ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసే శర్వానంద్ పల్లెటూరుకు వచ్చి ఎందుకు వ్యవసాయం చేశాడు..? అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి..? లాంటివి ట్రైలర్ లో సస్పెండ్ గా చూపించారు. ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా మార్చి 11న రిలీజ్ కాబోతోంది.
తాజా వార్తలు
- దుబాయ్లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







