కరోనా రూల్స్ బ్రేక్..366 షాప్స్ క్లోజ్
- March 05, 2021
సౌదీ:కరోనా నిబంధనలను పాటించటంలో విఫలమైన 366 షాపులను మూసివేసినట్లు సౌదీ గృహనిర్మాణ, మున్సిపల్, రూరల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వైరస్ ను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా నడుచుకోవాలని..ముఖ్యంగా వ్యాపార సంస్థలు, షాపు నిర్వాహకులు ప్రభుత్వం సూచించిన మార్గనిర్దేశకాలను తప్పనిసరిగా పాటించాలని మంత్రిత్వ శాఖ కోరింది. యాంటీ కరోనా వైరస్ ప్రయత్నాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన ఏ ఒక్కరిని ఉపేక్షించబోమని హెచ్చరించింది. నిబంధనలను పకడ్బందీగా అమలు చేసేందుకు కింగ్డమ్ వ్యాప్తంగా 24,066 షాపులు, అహార సంస్థలు, ప్రజా మార్కెట్లలో తనిఖీలు చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. తమ తనిఖీల్లో 1,226 చోట్ల ఉల్లంఘనలను గుర్తించినట్లు తెలిపారు. ఉల్లంఘన తీవ్రతను బట్టి కోవిడ్ రూల్స్ బ్రేకర్స్ పై చర్యలు చేపట్టామని..366 షాపులను మూసివేశామని వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..