కర్ఫ్యూ టైంలో మధ్యాహ్నం 2 గంటలకే బ్యాంకులు బంద్
- March 06, 2021
కువైట్:మార్చి 7 నుంచి నెల రోజుల పాటు కువైట్‌లోని బ్యాంకులు మధ్యాహ్నం 2 గంటల వరకే తెరిచి ఉంటాయని బ్యాంకర్లు స్పష్టం చేశారు. కరోనా తీవ్రత పెరగటంతో రేపటి నుంచి దేశవ్యాప్తంగా పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు మంత్రి మండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. నెల రోజుల పాటు ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అత్యవసర సేవలు, మసీదులో ప్రార్ధనలు, డెలివరీ సర్వీసులకు మినహా అన్ని రంగాల్లో కర్ఫ్యూ నిబంధనలు వర్తించనున్నాయి. కర్ఫ్యూ నేపథ్యంలో బ్యాంకు కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించిన బ్యాంకర్లు..మంత్రిమండలి నిర్ణయానికి అనుగుణంగా బ్యాంకులను మధ్యాహ్నం రెండు గంటలకే మూసివేయనున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో బ్యాంకు సిబ్బంది పూర్తి స్థాయి సామర్ధ్యంలో 50 శాతం సిబ్బందికి మాత్రమే విధులు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..