ట్విట్టర్లో కొత్త ఫీచర్
- March 06, 2021
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించే సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లలో ట్విట్టర్ ఒకటి. అయితే ట్విట్టర్‌లో… ఆ మాటకొస్తే ఏ సోషల్ మీడియాలో యాప్‌లోనైనా పోస్ట్ చేసిన తర్వాత దాన్ని ఎడిటింగ్ చేసుకునే అవకాశం ఉండదు. ఏదైనా తప్పుగా పోస్ట్ చేస్తే సదరు పోస్టును డిలీట్ చేసి మళ్లీ కొత్తగా పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం పోస్ట్ చేసిన తర్వాత కాసేపు ప్రివ్యూ చూపించి.. అందులో ఏమైనా తప్పులు ఉన్నాయో తెలుసుకునే అవకాశంతో పాటు, పోస్ట్‌ను డిలీట్ చేసే సౌలభ్యం కూడా ఉంటే బాగుంటుంది కదూ.! అచ్చంగా ఇలాంటి ఆలోచనే చేస్తోంది ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్. దీంతో ఇకపై ట్వీట్ చేసే ముందు ఐదు సెకన్లపాటు చూసుకునే అవకాశం కలగనుంది. ‘అన్ డు’ ఆప్షన్ పేరుతో తీసుకురానున్న ఈ ఫీచర్ ద్వారా ఐదు సెకండ్ల పాటు ‘అన్ డు’ అనే ట్యాబ్ కనిపిస్తుంది. అంతలోపు ఏమైనా తప్పులు ఉన్నాయని భావిస్తే.. ఆ ట్యాబ్‌పై క్లిక్ చేస్తే చాలు ట్వీట్ పోస్ట్ అవ్వదు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను టెస్టింగ్ కోసం కొంత మందికి అందుబాటులోకి తీసుకొచ్చారని సమాచారం. ఎలాంటి సమస్యలు లేవని నిర్ధారించుకున్న తర్వాత ఈ ఫీచర్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. ముఖ్యంగా ఈ ఫీచర్ ద్వారా స్పెల్లింగ్ మిస్టెక్స్‌కు చెక్ పెట్టవచ్చని సంస్థ భావిస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల ట్విట్టర్ ఆడియో ట్వీట్, స్పేసెస్ వంటి సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







