చోరీ కేసులో ఇండియన్ తో సహా 9 మందికి రిమాండ్
- March 07, 2021
సౌదీ: బతుకుదెరువు కోసం పరాయి దేశం వెళ్లి ఈజీ మనీ కోసం కక్కుర్తి పడ్డారు. విద్యుత్ పరికరాలను దొంగిలించి సొమ్ము చేసుకోబోయారు. చివరికి నేరం బటయపడి కటకటాల పాలయ్యారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులు నిందితులు అంతా ప్రవాసీయులే. 9 మంది నిందితుల్లో ఒకరు ఇండియన్ కాగా..మిగిలిన 8 మంది పాకిస్తానీయులు. నిందితులు అంతా ఓ ముఠాగా ఏర్పడి ఈజీ మనీ కోసం చోరీలను మార్గంగా ఎంచుకున్నారు. పవర్ డిస్ట్రిబ్యూషన్ స్టేషన్ల నుంచి విద్యుత్ పరికరాలు, రాగి తీగలను దొంగింలించటంతో పాటు నిర్మాణంలో భవనాల దగ్గర నిర్మాణ సామాగ్రిని చోరీ చేస్తున్నట్లు రియాద్ పోలీసులు వెల్లడించారు. నిందితులు దొంగిలించిన వస్తువుల విలువ దాదాపు పది లక్షల రియాల్స్ అని పోలీసులు తెలిపారు. అరెస్టైన తొమ్మిది మందిని రిమాండ్ తరలించామని..పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు కేసును బదిలీ చేయాల్సి ఉందని వెల్లడించారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం