కర్ఫ్యూ టైంలో బయటికి వచ్చేందుకు పాసుల జారీ
- March 07, 2021
కువైట్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు కర్ఫ్యూ విధించిన కువైట్ ప్రభుత్వం..అత్యవసర సమయాల్లో ప్రజలు బయటికి వచ్చేందుకు వెసులుబాటు కల్పిస్తూ కొన్ని సూచనలు చేసింది. మంత్రిమండలి నిర్ణయం మేరకు ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. ప్రతి రోజు 12 గంటల పాటు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అయితే..కర్ఫ్యూ సమయంలో అత్యవసరం అయితేనే ప్రజలు బయటికి రావాలని అధికారులు పిలుపునిచ్చారు. లేదంటే కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని..కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన ప్రవాసీయులు దేశ బహిష్కరణ శిక్ష ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించిన విషయం తెలిసిందే. అలాగే కర్ఫ్యూ రూల్ బ్రేక్ చేసిన పౌరులపై కేసులు నమోదు చేస్తామన్నారు అధికారులు. అయితే..ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా, వైద్య సేవలు పొందాల్సినవారు బయటికి వచ్చేలా అనుమతి ఇచ్చేలా మెకానిజాన్ని రూపొందించారు. https://curfew.paci.gov.kw/request/create ద్వారా అత్యవసర కారణాలను వివరిస్తూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు చెబుతున్న కారణంగా సహేతుకంగా ఉంటే కర్ఫ్యూ సమయంలోనూ బయటికి వచ్చేందుకు అనుమతి తెలుపుతూ ఆన్ లైన్లో పాసులు జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు. అయితే..కేవలం ఐదు సందర్భాల్లో మాత్రం పాసులను జారీ చేస్తామని కూడా స్పష్టత ఇచ్చారు. ప్రాథమిక చికిత్స కోసం, మెడికల్ చెకప్, బ్లడ్ డొనేషన్, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వారికి పాసులు జారీ చేస్తామన్నారు. అయితే..ఎవరైనా ఈ వెసులుబాటును దుర్వినియోగం చేయాలని చూసినా, తప్పుడు వివరాలతో పాసులు పొందాలని చూసిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం