లాకైన కార్లలో నుంచి 26 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు

- March 07, 2021 , by Maagulf
లాకైన కార్లలో నుంచి 26 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు

దుబాయ్: తల్లిదండ్రలు నిర్లక్ష్యం, పిల్లల ఆకతాయితనం చివరకు వాళ్ల ప్రాణాల మీదకు తెస్తోంది. ఇటీవలె దుబాయ్ లో కారు డోర్లు లాకైపోవటంతో ఓ చిన్నారి ఊపిరాడక చినిపోయాడు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. అయితే..దుబాయ్ పోలీసుల చొరవ, వెంటనే స్పందిస్తున్న తీరు కేవలం రెండు నెలల్లోనే 26 మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఏడాదిలో జనవరి, ఫిబ్రవరి నెల్లల్లో కారులో ఇరుక్కుపోయిన 11 మంది చిన్నారులను రక్షించినట్లు దుబాయ్ పోలీసులు వెల్లడించారు. బాత్రూం, ఎలివేటర్, గడియపడిన గదుల్లో ఇరుక్కుపోయిన మరో 15 మంది చిన్నారులను కూడా రక్షించామన్నారు. 2020 జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 212 చిన్నారులను కాపాడినట్లు వివరించారు. పిల్లలకు సంబంధించినంత వరకు ఇల్లు వారికి సురక్షిత ప్రాంతమని..అది ఎప్పటికీ సురక్షితంగా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలని పోలీసులు హితువు పలికారు. ముఖ్యంగా కారు తాళాలు పిల్లలకు అందుబాటులో ఉండకుండా చూసుకోవాలని, పిల్లలను ఒంటరిగా గదిలో ఉండనివ్వటం, గదిలోకి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఇలాంటి విషయాలల్లో డొమస్టిక్ వర్కర్లకు తగిన శిక్షణ ఇవ్వటం చాలా అవసరం అని పోలీసులు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com