కేంద్ర బడ్జెట్ పరీక్ష : మోదీ
- February 28, 2016
పరీక్షల సమయంలో విద్యార్థులు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరీక్షలను కేవలం మార్కులతో ముడి పెట్టొద్దని పేర్కొన్నారు. ఆల్ ఇండియా రేడియో ద్వారా మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో దేశ ప్రజలతో తన అభిప్రాయాలను పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. 'విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్నాయి.. అలాగే నాకు కూడా రేపు కేంద్ర బడ్జెట్ పరీక్ష ఉంది.. 125 కోట్ల భారతీయులు రేపు నన్ను పరీక్షించనున్నారంటూ కేంద్ర బడ్జెట్‌పై మోదీ వ్యాఖ్యానించారు.రేపు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నామనీ, తన పరీక్షతోపాటు విద్యార్థుల పరీక్షలూ సఫలమవుతాయని ఆశిస్తున్నానంటూ మోదీ చెప్పారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







