కోవిడ్ 19 ఎఫెక్ట్: 8 సౌదీ మసీదుల మూసివేత

- March 09, 2021 , by Maagulf
కోవిడ్ 19 ఎఫెక్ట్: 8 సౌదీ మసీదుల మూసివేత

రియాద్:సౌదీ అథారిటీస్, తాత్కాలికంగా 8 మసీదుల్ని మూడు రీజియన్లలో మూసివేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 10 మంది వర్షిపర్స్ కరోనా పాజిటివ్‌గా తేలడమే ఇందుకు కారణం. గడచిన 29 రోజుల్లో మొత్తం 236 మసీదుల్ని మూసివేయడం జరిగింది. వీటిల్లో 22 రి-ఓపెన్ అయ్యాయి. వాటిల్లో స్టెరిలైజేషన్ ప్రక్రియ అనంతరం పునఃప్రారంభించారు. రియాద్‌లో సోమవారం ఆరు మసీదుల్ని మూసివేశారు. మదీనాలో ఒకటి, తబుక్‌లో ఇంకోటి మూసివేయడం జరిగింది. గతంలో మూసివేసిన ఆరు మసీదుల్ని తిరిగి ప్రారంభించారు. వర్షిపర్స్ అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని కరోనా వ్యాప్తిని అరికట్టడంలో సాయపడాల్సిందిగా అథారిటీస్ కోరుతున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com