పబ్లిక్ స్కూల్స్‌లో వలస విద్యార్థుల రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 4 నుంచి
- March 09, 2021
యూఏఈ:ఏమిరేట్స్ స్కూల్స్ ఎస్టాబ్లిష్‌మెంట్, నాన్ ఎమిరేటీ రెసిడెంట్ విద్యార్థులు (వలస విద్యార్థులు) ఏప్రిల్ 4 నుంచి 15 మధ్యలో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. 2021-22 విద్యా సంవత్సరం కోసం ఈ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. 12వ గ్రేడ్ వరకు అన్ని గ్రేడ్ల విద్యార్థులకు రిజిస్ట్రేషన్ అందుబాటులో వుంటుంది. అయితే, కిండర్‌గార్టెన్ 1 మరియు 2కి మాత్రం ఎమిరేటీ విద్యార్థులే దరఖాస్తు చేసుకోవాలి.అబుధాబి ఎమిరేట్‌కి సంబంధించి రిమోట్ ప్రాంతాల్లో నివసిస్తోన్న యూఏఈ రెసిడెంట్లకు కూడా ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు.ఎమిరాతి విద్యార్థుల రిజిస్ట్రేషన్ మార్చి 7 నుంచి ఏప్రిల్ 1 వరకు కొనసాగుతుంది. పబ్లిక్ స్కూల్స్ తమ సామర్థ్యంలో 20 శాతం మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పించాలి. రెసిడెంట్ విద్యార్థులకు ఫీజు 6,000 దిర్హాములుగా నిర్ధారించారు. కాగా, పబ్లిక్ స్కూల్స్‌లో ప్రవేశం కోసం విద్యార్థులు 85 శాతం పైగా మార్కులు పొందాల్సి వుంటుంది. మ్యాత్స్, అరబిక్, ఇంగ్లీషు సబ్జెక్టుల్లో మెరుగైన మార్కుల ప్రాతిపదికగా రిజిస్ట్రేషన్లు వుంటాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







