'శశి' ట్రైలర్ విడుదల...
- March 10, 2021
హైదరాబాద్:ఆది సాయికుమార్ హీరోగా నటించిన చిత్రం 'శశి'. సురభి నాయికగా నటించిన ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ కి శ్రీనివాస్ నాయుడు దర్శకుడు. పవన్ కళ్యాన్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన టీజర్ తో పాటు 'ఒకే ఒక లోకం నువ్వే' పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోందని, ట్రైలర్ కూడా అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని నిర్మాతలు ఆర్.పి.వర్మ, సి.రామాంజనేయులు,చింతలపూడి శ్రీనివాస్ చెబుతున్నారు. 'మనం ప్రేమించే వాళ్ళు పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో.. ప్రమాదంలో ఉన్నప్పుడు అంతే భయంగా ఉంటుంది' అనే ఆది డైలాగ్ తో ట్రైలర్ ఆరంభం అవుతుంది. ఇక 'మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు, ముందు మన బలహీనతలను గెలవాలి'... 'ప్రేమంటే లేని చోట వెతుక్కోవడం కాదు.. ఉన్న చోట నిలబెట్టుకోవడం'... 'ప్రేమించిన వాడితో పెళ్లి చేయకుండా.. పెళ్లి చేసిన వాడితో ప్రేమగా ఉంటుందనుకోవడం మీ మూర్ఖత్వం' వంటి డైలాగ్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.ఈ పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కి కూడా ఇందులో చోటు కల్పించారు.

తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







