ముబారకియా మార్కెట్లలో అల్ షాయా తనిఖీలు

- March 10, 2021 , by Maagulf
ముబారకియా మార్కెట్లలో అల్ షాయా తనిఖీలు


కువైట్: మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ మునిసిపల్ ఎఫైర్స్ అలాగే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హౌసింగ్ ఎఫైర్స్ షాయా అల్ షాయా, ముబారకియా మార్కెట్లలో తనిఖీలు నిర్వహించారు. కువైట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ అహ్మద్ అల్ మాన్‌ఫుహి, ముబారకియా మార్కెట్స్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు గురించి మినిస్టర్ అల్ షాయాకి వివరించారు. ముబారకియా మార్కెట్‌లోని స్టోర్లను చిన్న అలాగే మధ్యస్థ ఎంటర్‌ప్రైజెస్‌కి మాత్రమే ఇవ్వాల్సిందిగా మినిస్టర్ అల్ షాయా సూచించినట్లు అల్ మాన్‌ఫుహి చెప్పారు. పెద్ద కంపెనీలకు ఇవ్వొద్దని మినిస్టర్ స్పష్టం చేసినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com