ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు,మరణాల వివరాలు...
- March 11, 2021
కరోనా వైరస్ మొత్తం ప్రపంచ దేశాలన్నింటిని చుట్టేసింది. ఏడాది గడుస్తున్నా కూడా.. ప్రతీ రోజూ నమోదయ్యే పాజిటివ్ కేసులు, మరణాలకు మాత్రం బ్రేక్ పడట్లేదు. ఇదిలా ఉంటే మరోవైపు యూకేలో పుట్టిన కొత్తరకం వైరస్ ప్రజలను మరింత భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇది కరోనా కన్నా 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు ప్రకటించడంతో దేశాలన్నీ కూడా మరోసారి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. ఇక తాజాగా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 118,684,343కి చేరింది. గడిచిన 24 గంటల్లో 4,61,455 పాజిటివ్ కేసులు.. 10,042 మరణాలు సంభవించాయి. అటు ఇప్పటిదాకా 2,633,281 మంది వైరస్ కారణంగా మరణించగా.. 94,288,555 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో ప్రతీ రోజూ భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 29,862,124కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 542,191 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్, యూకేలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బ్రిటన్, ఆఫ్రికా దేశాల్లో కొత్తరకం ‘స్ట్రెయిన్’ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచమంతా ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇండియాలో ఇప్పటివరకు 11,285,561 పాజిటివ్ కేసుల కేసులు నమోదు కాగా.. 158,213 మంది వైరస్ కారణంగా మరణించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







