కర్ఫ్యూ టైంలో హోమ్ డెలివరీకి పర్మిషన్ ఇచ్చే ఛాన్స్
- March 14, 2021
కువైట్:కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ప్రకటించిన పాక్షిక కర్ఫ్యూ అమలులోకి వచ్చి వారం కావొస్తోంది. ఈ వారం రోజుల్లో సామాన్య జనాలు, వ్యాపారాలపై కర్ఫ్యూ ప్రభావం..కోవిడ్ తీవ్రతపై కరోనా ఎమర్జెన్సీ కమిటీ నేడో రేపో సమీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. కమిటీ సమావేశంలో జనాలకు కొన్ని వెసులుబాట్లు ప్రకటించే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది. ముఖ్యంగా కర్ఫ్యూ సమయంలో హోమ్ డెలివరీ చేసేందుకు రెస్టారెంట్లకు అనుమతి ఇవ్వొచ్చని చెబుతున్నారు. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి కర్ఫ్యూ అమలులోకి రానుండటంతో కర్ఫ్యూకి ముందు రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న విషయం తెలిసిందే. దీంతో ట్రాఫిక్ కష్టాల పరిష్కారంపై కూడా కమిటీ దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలాఉంటే దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేసేందుకు కువైట్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాబోయే రోజుల్లో దాదాపు 5 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!