ఫేక్ రెస్టారెంట్ వెబ్ సైట్ల పట్ల అప్రమత్తం..పోలీసుల హెచ్చరిక
- March 14, 2021
యూఏఈ:ఆన్ లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నారా? అయితే..ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతే డబ్బులు చెల్లించాలని అజ్మన్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇటీవల కొందరు కేటుగాళ్లు రెస్టారెంట్ల పేరుతో నకిలీ వెబ్ సైట్లను సృష్టించి..ప్రజలను మోసం చేస్తున్నారని హెచ్చరించారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తూ కస్టమర్లను ఎట్రాక్ట్ చేస్తున్నారని తెలిపారు. నకిలీ వెబ్ సైట్లను నిజమే అనే భ్రమలో ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత పేమెంట్ గేట్వే ద్వారా డబ్బులు చెల్లిస్తుంటారు. దీంతో కార్డు వివరాలు కేటుగాళ్ల చేతికి వెళ్లిపోతాయి. ఆ తర్వాత వినియోగదారుల కార్డు నుంచి డబ్బులు డ్రా చేసుకుంటారని వివరించారు. అందుకే ప్రజలు రెస్టారెంట్ల నకిలీ వెబ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అజ్మన్ పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్