`విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్` కర్టన్ రైజర్!
- March 15, 2021
హైదరాబాద్:పద్మాలయ సంస్థ 52 వసంతాలు పూర్తి చేసుకోవడంతో పాటు, విజయకృష్ణ మూవీస్ స్థాపించి 50 వసంతాలు అవుతున్న సందర్భంగా ఇరు సంస్థలకు మూల స్థంభం అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ, పద్మాలయ రధసారథి జి. ఆదిశేషగిరిరావును, విజయకృష్ణ మూవీస్ నిర్మాతలు ఎస్.రవి కుమార్,రమానంద్ ( కీ.శే.విజయనిర్మల సోదరులు)లను సీనియర్ నటుడు నరేష్, అతని తనయుడు నవీన్ విజయ్ కృష్ణ సత్కరించారు. విజయకృష్ణ మూవీస్ సూపర్‌హిట్ చిత్రం 'మీనా'తో ప్రారంభించి, 'హేమాహేమీలు, అంతం కాదు ఇది ఆరంభం' లాంటి చిత్రాలు కృష్ణతో నిర్మించడంతో పాటు నరేష్‌తో 'ప్రేమ సంకెళ్లు, ముక్కోపి' లాంటి హిట్ చిత్రాలు నిర్మించి, విజయనిర్మలకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లభించడానికి దోహదపడింది. 1976 నుండి డబ్బింగ్, రికార్డింగ్ స్టూడియోలు, ఎడిటింగ్ రూమ్స్ లో పాటు సినీ పరిశ్రమకు కావాల్సినటువంటి పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోస్ విజయకృష్ణ మూవీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ సంస్థ 50 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా రెండోతరం అయినటువంటి డా.నరేష్, మూడోతరం నవీన్ విజయ కృష్ణ ఆ సంస్థని `విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్` పేరుతో పునర్నిర్మాణం చేశారు.ఇప్పడు సినీ పరిశ్రమకు కావాల్సిన సదుపాయాలు, హార్డ్ వేర్, సాఫ్ట్‌వేర్ తయారు చేయడానికి రంగం సిద్దం చేశారు.ఈ క్రమంలో కర్టన్ రైజర్ కార్యక్రమాన్ని సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సాయిధరమ్ తేజ్,ఆనంద్ దేవరకొండ,సుధీర్ బాబు,వెంకటేష్ మహా, శ్రీరామ్ ఆదిత్య, వి ఐ ఆనంద్, శరత్ మరార్, మదాల రవి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







