నిరుద్యోగులకు గుడ్ న్యూస్..డిగ్రీ అర్హతతో జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్లో జాబ్స్
- March 16, 2021
జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-GIC అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫైనాన్స్, జనరల్, లీగల్, ఇన్స్యూరెన్స్ విభాగాల్లో 44 ఖాళీలను ప్రకటించింది. ఫైనాన్స్ విభాగంలో 15, జనరల్ విభాగంలో 15, లీగల్ విభాగంలో 4, ఇన్స్యూరెన్స్ విభాగంలో 10 పోస్టులున్నాయి. డిగ్రీ, పీజీ పాస్ అయినవారు అప్లై చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 2021 మార్చి 29 లోగా అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అఫీషియల్ నోటిఫికేషన్ https://www.gicofindia.com/ వెబ్సైట్లో చూడొచ్చు. ఇక ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.
అభ్యర్థులు ముందుగా https://www.gicofindia.com/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో Careers పైన క్లిక్ చేయాలి.
Click here to apply online – Recruitment of Scale I Officers లింక్ పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో NEW REGISTRATION పైన క్లిక్ చేయాలి.
పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, అడ్రస్ లాంటి వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత స్టెప్‌లో ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి.
ఫోటో, సంతకం అప్లోడ్ చేసిన తర్వాత విద్యార్హతలు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత అప్లికేషన్ ప్రివ్యూ చూసుకోవాలి. తప్పులు ఏవైనా ఉంటే సరిచేయాలి.
ఆ తర్వాత save and next పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత దరఖాస్తు ఫీజు రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, GIC ఉద్యోగులు, GIPSA మెంబర్ కంపెనీల అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు ఫీజు చెల్లించిన Final Submit బటన్ పైన క్లిక్ చేయాలి.
మీ అప్లికేషన్ ఫామ్ విజయవంతంగా సబ్మిట్ అవుతుంది.
అప్లికేషన్ వివరాలు ఎస్ఎంఎస్, ఇమెయిల్‌లో వస్తాయి.
దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.
జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్లో అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1 పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 మార్చి 29 చివరి తేదీ. ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి రూ.32,795 బేసిక్ పేతో పాటు డీఏ, హెచ్ఆర్ఏ లాంటి అలవెన్సులు ఉంటాయి. మొత్తం రూ.65,000 వేతనం లభిస్తుంది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం