చైన్ సిస్టంతో యూఏఈలో గోల్డ్ స్కాం..నలుగురుకి జైలు శిక్ష, జరిమానా

- March 16, 2021 , by Maagulf
చైన్ సిస్టంతో యూఏఈలో గోల్డ్ స్కాం..నలుగురుకి జైలు శిక్ష, జరిమానా

యూఏఈ: గోల్డ్ స్కీం పేరుతో వేల మందిని మోసం చేసిన నలుగురికి యూఏఈ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 10 మిలియన్ల దిర్హామ్ ల జరిమానా విధించింది. నిందితులు పిలిఫినోలని కోర్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ నలుగురు పిలిఫోనులు యూఏఈలోని పిలిఫినోలను టార్గెట్ గా చేసుకొని భారీ స్కాంకు స్కెచ్ వేశారు. గోల్డ్ ఎంపైర్ మేనేజ్మెంట్ పేరుతో ఓ వెబ్ సైట్ ను క్రియేట్ చేసి..తాము గోల్డ్ స్కీం పెడుతున్నట్లు సోషల్ మీడియా, ఇతర మాధ్యామాల్లో విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. తమ స్కీంలో చేరాలంటే ఒక్కో వ్యక్తి 2000 దిర్హామ్ లు చెల్లించాలని..ఆ తర్వాతి కాలంలో కల్లు చెదిరే రేంజ్ లో లాభాలు ఆర్జించవచ్చని ఆశపెట్టారు నిందితులు. అంతేకాదు..తమ స్కీంలో కొత్త సభ్యులను చేర్పిస్తే ఒక్కో కొత్త సభ్యుడికిగాను 1000 దిర్హామ్ ల చొప్పున చేర్పించిన వారికి రివార్డ్ గా అందిస్తామని ప్రచారం చేశారు. అలా దాదాపు 4000 మంది పిలిఫినోలను చైన్ సిస్టం స్కీమ్ పేరుతో చీట్ చేశారు నిందితులు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు నిందితులకు జైలు శిక్ష, జరిమానాతో పాటు శిక్షాకాలం తర్వాత దేశబహిష్కరణ వేటు కూడా వేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com