భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 17, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి.రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న తరుణంలో కేంద్రం అప్రమత్తం అయ్యింది.అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తోంది.అదే విధంగా ఈరోజు ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతున్నారు.కరోనా కేసులు, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై ఈరోజు చర్చించబోతున్నారు. ఇక ఇదిలా ఉంటె, దేశంలో కొత్తగా 28,903 కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,14,38,734కి చేరింది.ఇందులో 1,10,45,284 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,34,406 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటల్లో భారత్ లో 188 మంది కరోనాతో మృతి చెందారు.దీంతో ఇప్పటి వరకు భారత్ లో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,59,044కి చేరింది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







