రమదాన్ నేపథ్యంలో కోవిడ్ 19 సూచనలు
- March 17, 2021
యూఏఈ: పవిత్ర రమదాన్ మాసం నేపత్యంలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్, కొన్ని స్పష్టమైన సూచనలు, హెచ్చరికలు, ఆదేశాలు జారీ చేసింది. కుటుంబాల సమూహం, ఆహారం పరస్పరం పంచుకోవడం వంటివాటికి దూరంగా వుండాలని మినిస్ట్రీ సూచించింది. మసీదులు, ఇతర బహిరంగ ప్రాంతాల్లో సామూహికంగా ఇఫ్తార్ టెంట్లను నిర్వహించడాన్ని, ఇప్తార్ మీల్స్ ఏర్పాటు చేయడాన్నీ నిషేధించింది. రెస్టారెంట్లు మీల్స్ పంపిణీ చేయడానికి వీల్లేదు. లేబర్ అకామడేషన్లలో మాత్రమే మీల్స్ పంపిణీ చేయాల్సి వుంటుంది. ఎవరైతే కార్మికులకు మీల్స్ పంపిణీ చేయాలనుకుంటారో, వాళ్ళు ముందుగా అకామడేషన్ మేనేజ్మెంట్ని అలాగే రెస్టారెంట్లను సంప్రదించి, ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయాల్సి వుంటుంది. తరావీ ప్రార్థనలు ఖచ్చితమైన సూచనలకు లోబడి మాత్రమే చేయాల్సి వుంటుంది. ఇషా మరియు తరావీ ప్రార్థనలు 30 నిమిషాలకు లోబడి మాత్రమే చేయాలి. రమదాన్ మాసంలో అధికారులు ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్