యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయులను ..స్వదేశానికి చేరుకునేలా ఏర్పాట్లు

- March 17, 2021 , by Maagulf
యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయులను ..స్వదేశానికి చేరుకునేలా ఏర్పాట్లు

యూఏఈ మీదుగా కువైట్ వెళ్లబోయిన భారతీయులను ప్రయాణ ఆంక్షల కారణంగా యూఏఈలోనే చిక్కుకుపోయారు.అంతేకాదు..కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి నేరుగా తమ దేశానికి ప్రయాణికులను అనుమతించకుండా కువైట్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయా దేశాల నుంచి కువైట్ వెళ్లే వారు ఇతర గల్ఫ్ దేశాలకు వెళ్లి క్వారంటైన్ గడువు ముగిసిన తర్వాత కువైట్ చేరుకుంటున్నారు. అయితే..ఇటీవలి కాలంలో కోవిడ్ కేసుల తీవ్రత పెరుగుతుండటంతో కువైట్ అన్ని దేశాల అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. దీంతో యూఏఈ మీదుగా కువైట్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న వందల మంది భారతీయులను యూఏఈలోనే చిక్కుకుపోయారు. కువైట్ కు వెళ్లలేక..తిరిగి ఇంటికి వచ్చేందుకు డబ్బులు చాలక అవస్థలు పడాల్సి వస్తోంది. అలా చిక్కుకుపోయిన వారిని ఆదుకునేందుకు యూఏఈలోని ప్రవాస భారతీయ సంఘాలు, భారతీయ దౌత్య కార్యాలయం తమ వంతు సహాయాన్ని అందిస్తున్నాయి. ప్రవాస భారతీయులు నివాసం, అహార సదుపాయలను కల్పిస్తుండగా..దౌత్య కార్యాలయం వారిని తిరిగి స్వదేశానికి పంపించేందుకు ఉచితంగా విమాన టికెట్లను అందిస్తోంది. యూఏఈలోని ప్రవాసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన విన్నపాలను పరిశీలించిన భారత దౌత్య కార్యాలయం ఇప్పటివరకు 40 మందికి విమాన టికెట్లను ఉచితంగా అందించి భారత్ కు తిరిగి పంపించింది. యూఏఈలో చిక్కుకుపోయిన వాళ్లందర్ని సురక్షితంగా స్వదేశానికి పంపిస్తామని, అయితే..విడతల వారీగా ప్రక్రియ కొనసాగతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు దుబాయ్, అజ్మన్ లోని పలు ప్రాంతాల్లో 113 మంది భారతీయులకు ప్రవాస భారతీయులు భోజన, నివాస వసతులతో ఆశ్రయం కల్పించారు.ఇందులో 13 మందికి కాన్సులేట్ కార్యాలయం ఉచిత టికెట్లను అందించింది. ఇదిలాఉంటే..యూఏఈలోని భారత వ్యాపారి సాజి చేరియన్ యూఏఈలో చిక్కుకుపోయిన దాదాపు 400 మంది బ్లూ కాలర్ కార్మికులకు ఆశ్రయం కల్పించారు. అందులో ఇప్పటికే చాలా మందిని స్వదేశానికి తరలించామని హర్జీత్ సింగ్(కాన్సుల్ లేబర్) తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com