కొత్త వ్యక్తిగత వస్తువులపై పన్నులు: సౌదీ అరేబియా కస్టమ్స్ వివరణ

- March 17, 2021 , by Maagulf
కొత్త వ్యక్తిగత వస్తువులపై పన్నులు: సౌదీ అరేబియా కస్టమ్స్ వివరణ

సౌదీ అరేబియా: సౌదీ అరేబియాకి వచ్చే ప్రయాణీకులు, వ్యక్తిగత వస్తువలకు సంబంధించి 3,000 సౌదీ రియాల్స్ లోపు అయితే కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సిన అవసరం లేదని కస్టమ్స్ విభాగం స్పష్టం చేసింది. వ్యక్తిగత షిప్‌మెంట్స్ త్రెషోల్డ్ 1,000 సౌదీ రియాల్స్ (షిప్పింగ్ ఫీజుతో కలిపి). దిగుమతి చేసుకునే వస్తువులపై 15 శాతం వ్యాట్ విధిస్తారు. వినియోగించిన ఫర్నిచర్ అలాగే వ్యక్తిగత వస్తవులకు సంబంధించి విద్యార్థులకు పన్నుల నుంచి మినిహాయింపునిస్తున్నారు. అయితే కాలేజీ అటెండెన్స్ ప్రూఫ్ చూపాలి. 206 ఆ పైన తయారైన కార్లు యూఏఈ నుంచి సౌదీ అరేబియాకి దిగుమతి చేసుకోవచ్చు. అయితే స్థానికంగా వున్న స్టాండర్డ్స్‌కి అనుగుణంగా వుండాలి. ఫ్యూయల్ ఎకానమీకి సంబంధించి కూడా స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. ఇతర గల్ఫ్ దేశాల నుంచి దిగుమతయ్యే గూడ్స్ కూడా 15 శాతం వ్యాట్ వర్తిస్తాయి. షిప్పింగ్ ఫీజు, కస్టమ్స్ ఫీజు ఇతర ఫీజులు వర్తిస్తాయి. గల్ఫ్ దేశాల మధ్య ఎలక్ట్రానిక్ సర్వీసు సిస్టమ్ ప్రారంభమయ్యేవరకు ఇవన్నీ అప్లయ్ అవుతాయని సౌదీ కస్టమ్స్ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com